Thursday, October 17, 2024

Flood – కాళేశ్వరంలో మెదటి ప్రమాద హెచ్చరిక జారీ

— మరో మీటర్ పెరిగితే డేంజర్ లెవెల్

— మేడిగడ్డ ఇన్ ప్లో 819500 క్యూసెక్కులు ,

అవుట్ ప్లో 819500

మహాదేవపూర్ (ప్రభ న్యూస్) : సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ జిల్లా మహదేవాపూర్ మండలం కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం మొదటి ప్రమాద లెవెల్ కు చేరింది. సోమవారం 12 మీటర్ల ఎత్తునుండి గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

- Advertisement -

గోదావరి నది వద్ద స్నానాలు, పూజ కార్యక్రమాలు నిషేధించారు. ప్రాణహిత గోదావరి నదుల నీరు ఇన్ఫ్లో 819500 క్యూసెక్కులు మేడిగడ్డ బ్యారేజ్ లో చేరడంతో 85 గేట్లు ఎత్తి 819500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement