చింతూరు(అల్లూరి జిల్లా), వి.ఆర్.పురం, ప్రభన్యూస్ :
చింతూరు మన్యంలో వర్షకాలం వచ్చిందంటే వరద భయం మొదలవుతోంది. మన్యంలో మూడురోజులగా వర్షాలు కురుస్తుండ టంతో వారు అప్రమత్తమవుతున్నారు. సురక్షిత ప్రాంతాలపై వరద బాధితులు చూపు పడింది. భద్రాచలంవద్ద గోదావరి నిన్నమొన్నటివరకు ఎడారిలా ఉంది. కానీ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి గోదావరి ప్రవాహం 19.4 అడుగులకు చేరుకుంది. చింతూరు, వి.ఆర్.పురం, కూనవరంవద్ద కూడా అటు గోదావరికి, ఇటు శబరికి క్రొత్త నీరు చేరుకుంటున్నది. దీంతో పోలవరం ముంపు మండలాలకు ఇప్పుడు వణుకు పుడుతోంది.
గత ఏడాది వరదలు భీభత్సం సృష్టించి అనేక గ్రామాలను అతలాకుతలం చేశాయి. 1986 సంవత్సరంలో వచ్చిన భారీ వరదను తలపించే విధంగా గోదావరి గ్రామాలను నీట ముంచిన విషయం తెలిసిందే. ఆ వరదలతో బాధితులు చెట్టు-, పుట్ట, గుట్టల్లో ఎక్కి గుడారాలు వేసుకొని బ్రతుకు జీవుడా అంటూ వర్షాలలో తల దాచుకొని కాలం గడిపారు. చిమ్మ చీకట్లు-, విష పురుగులు మధ్య నరకం చవి చూశారు. గత ఏడాది వరద సహాయక చర్యలు నామ మాత్రంగా అన్నట్లు- ప్రభుత్వం అరకొరగా జరిగాయని ముంపు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం 47 అడుగులకు వరద చేరితే విలీన మండలాల్లోని పలు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తెలం గాణాలో వర్షాలు ఉధృతంగా కురుస్తుండటంతో మన్యం వాసుల్లో వరద భయం మొదలైంది.
ఇళ్ల కోసం వేట
చింతూరు మన్యంలో నాలుగు విలీన మండలాల్లో గత జూలై, ఆగష్టు నెలల్లో వచ్చిన వరద మళ్లీ ఇప్పుడు కూడా వస్తే మా పరిస్థితి ఏమిటోనని భయంతోనే ముందుగానే ఆ వరదల్లో తలదాచుకునేందకు గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలుు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లెె ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోని లోతట్టు ప్రాంత వాసులు మైదాన ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాల్లో ఉండేందుకు సిద్ధమై ఇళ్ళ వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వి.ఆర్.పురం మండలంలోని వరద ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలు గుట్టల్లో పాకలు, గుడారాలు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే శ్రీరామగిరి గ్రామస్థులు ముందుగానే అక్కడ ఉన్న గుట్టలపై గుడరాలతో పాటు గూళ్ళను నిర్మించుకుంటున్నారు. ఏజేన్సీలో ఉన్న పళంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో దీనికి తోడు ఎగువ గోదావరి కురిసే వర్షాలు ఎక్కువైతే గోదావరి వస్తుందని భావించిన అనేక గ్రామాల వారు ముందుగా సురక్షిత ప్రదేశాలలో తలదాచుకునేందుకు గుట్టల్లో పాకలు సిద్ధం చేసుకుంటున్నారు.
కాఫర్ డ్యాం వల్లే అప్పుడు వరద
పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాం వలనే గత ఏడాది వరద బీభత్సం సృష్టించిందనేది విలీన మండలాల్లోని నిర్వాసితుల వాదన. పునరావాసం ప్యాకేజీ ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్న ప్రభుత్వం ఇంకా అనేక ముంపు గ్రామాలకు పున రావాసం చూపలేదని, ప్యాకేజీ చెల్లించలేదని నిర్వాసితులు వాపోతున్నారు. మొదటి కాంటూర్‌లోని 18 గ్రామాలు ఉన్నప్పటకీ గత ఏడాది వచ్చిన వరద రెండవ కాంటూర్ దాటి గ్రామాలను ముంచెత్తిందని బాధిత గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇదంతా కాఫర్ డ్యాం వలనే జరిగి ఉంటుందని వరద బాధితులు ఆరోపిస్తున్నారు.
సహాయం అంతంత మాత్రమే
మన్యంలో గత ఏడాది వచ్చిన గోదావరి వరదలకు ప్రభుత్వము అరకొరగానే సహాయక చర్యలు చేపట్టిందని ముంపు మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇళ్ళు కొట్టు-కుపోయి దెబ్బతిన్న ఇళ్లకు అరకొరగా కొన్ని గ్రామాలకు పరిహారం ఇచ్చి చేతులు దులుపకుందని నిర్వాసితులు వరద బాధితులు ఆరోపిస్తున్నారు. వరద సహాయక చర్యలకు లాంచీలు పెట్టీ- ముందుగానే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని, వరద ఉన్నంత కాలం వారికి నిత్యావసర సరుకులు కిరోసిన్ బియ్యం ప్రతి కుటు-ంబానికి గుడారాలు వేసుకునేందుకు టర్పాలిన్స్ సరఫరా చేయాలని, వరద ఉన్న సమయంలో . మొబైల్ మెడికల్ బృందాన్ని లాంచీ ద్వరా ఏర్పాటు- చేసి మునక గ్రామాల వారికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత వరదలకు నష్టపోయిన అన్ని కుటు-ంబాలకు వరద నష్ట పరిహారం చెల్లించాలని ప్రజలు ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
నేడు సమీక్ష
చింతూరు మన్యంలో వర్షాలు ప్రారంభం కావడంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో నేడు శనివారం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలు వరద సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చింతూరు సబ్ కలెక్టర్ సూరజ్ గనోరే ఒక ప్రకటనలో పేర్కోన్నారు. ఈ సమావేశానికి జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.