Monday, November 18, 2024

కర్నూలు నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు.. 4 గంట‌ల ప్ర‌యాణం 45 నిమిషాల్లో..

రాయలసీమ వాసులకు మరో శుభవార్త. కర్నూలు నుంచి అదనపు విమానసేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు వరకు విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు అదనంగా మరో సర్వీసు వచ్చి చేరుతుంది . ప్రస్తుతం ఏపీలో విమానయాన సేవలు ఎక్కువ. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలతో పాటు కొత్తగా కడప, కర్నూలు విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చాయి. ప్రతిరోజూ వివిధ నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్న పరిస్థితి. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇప్పటి వరకూ విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, విజయవాడ నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు ఉన్నాయి. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదుకు కూడా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల్నించి వచ్చిన వినతులు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రయత్నాలు ఫలించడంతో హైదరాబాదుకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు నుంచి హైదరాబాదుకు ఇక నుంచి కొత్తగా ఎయిర్‌లైన్స్‌ హీగ్‌ సంస్థ విమాన సర్వీసు నడవనుంది.

కర్నూలు – హైదరాబాద్‌కు ఇరు రాష్ట్రాల ప్రయాణికులు వ్యాపార, ఇతర ప్రాణుల నిమిత్తం ఎక్కువగా ప్రయాణిస్తారు. బస్సులో వెళ్లడం వల్ల దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. తిరిగి వచ్చేందుకు అదే సమయం పట్టడం వల్ల ఇబ్బందులున్నాయి. ఇటు-వంటి అధిగమించేందుకు కర్నూల్‌ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ కు సర్వీసు నడపడం శుభసూచకం. వీటివల్ల కేవలం 40 నిమిషాల నుంచి 45 నిమిషాల్లో కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌ కు రూ. 1500 టికెట్‌ ధర ఉండే అవకాశం లేకపోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement