Tuesday, November 26, 2024

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌..!

కర్నూలు, ప్రభన్యూస్ : కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. ఈ మేరకు శుక్రవారం కేబినెట్‌లో మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం కుదుర్చుకుంది. కడప విమానాశ్రయం నుంచి కడప-విజయవాడ, కడప-చెన్నై, కర్నూలు నుంచి విజయవాడకు వారానికి 4 సర్వీసులు27 మార్చి నుంచి ఆపరేషన్‌లు ప్రారంభం కానున్నాయి. కర్నూలు జిల్లా డోన్‌లో బాలికల బీసీ గురుకుల పాఠశాల, జూనియర్‌ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీ-ఎస్‌ కట్టే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసలుబాటు-కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఓటీ-ఎస్‌ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీస్‌కి స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ మినహాయింపులకు అంగీకరించింది. జనవరి 1, 2022 నుంచి పెన్షన్‌ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.కోవిడ్‌ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదంవారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వనున్న ప్రభుత్వం జూన్‌ 30 లోగా నియామకాలు చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయం. తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement