Thursday, November 28, 2024

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఫ్లెక్సీ వార్ చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రేపు తణుకు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ మంత్రి కారుమూరి అనుచరులు సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

టీడీపీ ప్రభుత్వంలో రైతులు పడిన ఇబ్బందులతో పాటు ఇప్పటి ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరిస్తూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు పాదయాత్ర సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో చంద్రబాబు రోడ్ షోని నిరసిస్తూ మంత్రి ఆదిమూలపు సురేశ్ రోడ్డుపైనే తన షర్ట్ విప్పేసి కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన తెలిపిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement