ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని పేర్కొంది.
పేపర్ లీక్ వల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అలాగే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. పేపర్ లీక్ చేసిన, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు ఆదేశాలిచ్చింది..
- Advertisement -