మచిలీపట్నం : క్రిష్ణా జిల్లా కలెక్టరేట్లో గన్ మిస్ ఫైర్ అయిన ఘటన ఈరోజు జరిగింది. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు చేతిలో గన్ ఫైర్ కావడంతో అతని గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది.. శ్రీనివాసరావు కలెక్టరేట్లోని ట్రెజరీ గార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. గాయాలపాలైన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పోలీస్ అధికారులు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. ఘటనకు గల కారణాలు వెంటనే తెలియ జేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Flash.. Flash: కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ గుండెల్లోకి బుల్లెట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement