మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు చంద్రబాబు ఈ రోజు రేపు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన ఉదయం నుంచి గ్రామాల్లో వరద నీటిలో బోటు ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబును గోదావరి జిల్లాలకు చెందిన నేతలు అనుసరిస్తున్నారు. అందులో భాగంగా.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా అపశృతి చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రయాణం చేస్తున్న బోటు తప్పుకోగా.. నేతలంతా ప్రయాణిస్తున్న రెండు బోట్లు ఢీ కొని బోల్తా పడ్డాయి. చంద్రబాబు సురక్షితంగా బయట పడ్డారు. చంద్రబాబుకు లైఫ్ జాకెట్ వేయటంతో ఎటువంటి సమస్య తలెత్తలేదు.
బోటులో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమా.. నిమ్మకాయల చినరాజప్ప.. ఉండి ఎమ్మెల్యే రామరాజు.. తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ గోదావరి వరద నీటిలో పడిపోయారు. వారితో ఉన్న సహాయక సిబ్బంది వెంటనే వారిని వరద నీటిలో నుంచి తీసుకొని గట్టు పైకి చేర్చారు. మొత్తం 15 మంది వరకు వరద నీటిలో జారిపోయారు. బరువుకు మించి నేతలు ఒక బోటులో ఉండటంతో..ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.