శ్రీకాళహస్తీశ్వర ఆలయం, (ప్రభ న్యూస్): శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో శుక్రవారం స్వామి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు జరుగుతాయి. వెండి పల్లకిలో భోలాశంకరుని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని పడమటి ఉత్తరాభిముఖులై ప్రతిష్టించగా ఎదురుగా ధ్వజస్తంభం తూర్పు అభిముఖంగా స్వామి అమ్మవార్లు దర్శన భాగ్యం కల్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలు, కలశాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం శివనామస్మరణ మధ్య భక్తులు సమర్పించిన చీరలను ధ్వజస్తంభానికి అధిరోహించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా ధ్వజారోహణం.. శివయ్య బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
Advertisement
తాజా వార్తలు
Advertisement