Thursday, November 21, 2024

BREKING NEWS: సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్

(మచిలీపట్నం – ప్రభన్యూస్)
కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఆదివారం విషాదఛాయలు అలుముకున్నాయి. సముద్రంలో ఐదుగురు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కొట్టుక‌పోగా మెరైన్ పోలీసులు న‌లుగురిని కాపాడ‌గా ఒక‌రు మృతి చెందారు.

సెలవు కావడంతో నూజివీడు త్రిబుల్ ఐటీ లో చదువుతున్న 5 గురు స్టూడెంట్ ఉదయాన్నే మచిలీపట్నం బీచ్ లో స్నానం చేయడానికి దిగారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులంతా కలిసి తాళ్ళపాలెం బీచ్ లో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.

కొద్దిసేపటికి ఇంతలోనే వారి ఆనందంపై ఓ రాకాసి అల నీరుచల్లింది. సముద్రపు అలలు పెద్ద ఎత్తున రావడంతో కొట్టుకుపోతున్న నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించారు. అదే సమయంలో పెద్ద అలల కింద తోకల అఖిల్ కొట్టుకుపోవడం విషాదాన్ని మిగిల్చింది. మెరైన్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేసిన అతని జాడ కనపడలేదు. గల్లంతయిన అఖిల్ కోసం మెరైన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు సందర్భంగా అఖిల్ మృతదేహం లభ్యమైంది. మిత్రులందరికీ అఖిల్ మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement