గుంటూరు/అవనిగడ్డ ప్రభన్యూస్ బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం కురిసిన అకాలవర్షం, పిడుగుల ధాటికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల వరికుప్పలు దగ్ధమయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ దుర్ఘటనలు సంభవించాయి. ఆరు గాలం శ్రమించి పండించిన పంట వర్షం పాలవుతుం దన్న ఆందోళనలో కల్లాళ్లోని మిర్చి, తదితర పంట లపై టార్పాలిన్, పట్టాలు కప్పుతుండగా మృత్యువు కబళించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం పాత మల్లాయపాలెంలో ఆదివారం ఈ దుర్ఘట న చోటుచేసుకుంది. నిన్నమొన్నటివరకు ఎండలు మండిపోయాయి. కానీ ఆదివారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు కన్పించింది. మబ్బులు కమ్ముకొస్తూండటంతో కళ్లాల్లోని మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. పాత మల్లాయపాలెంకు చెందిన రైతులు చాట్ల శ్యాంబాబు, కొరివి కృపానందం తమ పొలంలో ఆరబోసిన మిర్చి పై పట్టాలు కప్పేందుకు వెళ్లారు. వారు పట్టాలు కప్పు తున్న సమయంలో హఠాత్తుగా కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపుతో ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా వారి కళ్ళు కన్పించకపోవడంతో పాటు ఏదో పెద్ద శబ్ధం రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమీపంలోని రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని హుటాహుటిన ప్రత్తిపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిద్దరిని వైద్యులు పరీక్షిం చారు. బాధితుల్లో ఒక రైతు అప్ప టికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించా రు. మరొకరికి చికిత్స చేస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు సర్వజన వైద్యశాలకు తరలించారు. చాట్ల శ్యాంబాబుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య ఉన్నారు. కొరివి కృపానందా నికి ఒక కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. వారి మరణం ఆ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు తల్లడి ల్లిపోయారు. వారి రోదనలు గుండెలను పిండేశాయి.
దివిసీమలో…
కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులుఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దివిసీమ ప్రాంతంలో పిడుగు లు దాటికి ముగ్గురు మృతిచెందగా, ఐదు చోట్ల వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దివిసీమలో 26.8 మిల్లీ మీటర్ల సగటు- వర్షపాతం నమోదయింది. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్ రోడ్‌లో 90 ఏళ్ళ వృద్ధు రాలు కె.నాంచారమ్మ, చల్లపల్లి కమల్ థియేటర్ దగ్గర సైకిల్‌షాప్ మస్తాన్ పిడుగు శబ్దానికి గుండె పోటు-తో కుప్పకూలి మృతి చెందారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మత్తి వెంకటరామ య్య (చిన్నా)(53) పొలంలో మొక్కజొన్నలు ఆర బెడుతూ ఉండగా పిడుగుపాటు-కి గురై మృతి చెందా డు. కోడూరు మండలం పిట్టల్లంక గ్రామంలో పిడుగుపాటు-కు బావి శెట్టి గోపాలరావు చెందిన వరికుప్పలు, మోపిదేవి మండలం పెద్ద కళ్ళేపల్లి గ్రామంలో చీరల నరసింహారావుకు సంబంధించిన ఎకరం వరికుప్ప, చల్లపల్లి మండలం రామానగరం లో ఐదు ఎకరాల వరిగడ్డి దగ్ధమైంది. వి కొత్తపాలెం గ్రామంలో పిడుగుపాటు-కు ఎకరం 50 సెంట్లలో వరి కుప్ప దగ్ధమైంది. కోడూరు మండలం బడేవారి పాలెంలో బడే బలరాంకు చెందిన వరికుప్ప పిడుగు పాటు-కు పూర్తిగా దగ్ధమైంది.