Saturday, November 23, 2024

సరిపడ బస్సులు లేక విద్యార్థుల ఇక్క‌ట్లు

చెన్నూరు పట్టణ కేంద్రం నుంచి కోటపెల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూలుకు వెళ్ళే విద్యార్థులకు సమయానికి సరిపడా ఆర్టీసీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేకమార్పులు తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టారు . అందులో బాగంగా కోటపెల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ నెలకొల్పింది ఈ పాఠశాలకు ప్రతిరోజు చెన్నూర్ పట్టణం నుండి సుమారు రెండు వందల మంది విద్యార్థులు వెళ్ళి విద్యను అభ్యసిస్తారు అయితే ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపక పోవడం తో విద్యార్థులు తీవ్రఇబ్బందులు ప‌డుతున్నారు. సంబంధింత అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యతును దృష్టిలో పెట్టుకొని ఉదయం సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడుపాలని ప్రజలు విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement