వెలుగోడు నవంబర్ 21 ఆంధ్రప్రభ న్యూస్ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మంగళవారం నాడు శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 11 లక్షల రూపాయలు విలువ చేసే చేప పిల్లలను ఎమ్మెల్సీ ఇషాక్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంఘం నాయకులు తెలుగు రమణ ,తెలుగు నాగరాజు, తెలుగు శ్రీనివాసులు సంఘం అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డిని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ని పూనమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి కోసం తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం వైఎస్సార్ మత్సకార భరోసా, డీజిల్ సబ్సిడీ లాంటి పథకాల ద్వారా రెండు లక్షల 18 వేల 153 మందికి నాలుగువేల 486 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించిందన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తారన్నారు
. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ రెడ్డి జిల్లా నాయకులు దేశం తిరుపం రెడ్డి ,వెలుగోడు గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్, ఇలియాస్ ఖాన్, షంషీర్ అలీ, వెల్డర్ ఖాదర్ వలీ, మమ్మద్ ఖాన్, మత్స్యకారులు వైఎస్ఆర్సిపినాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.