Friday, November 22, 2024

శాంత గోదావ‌రి – ధవ‌ళేశ్వ‌రం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక ఎత్తివేత

అమరావతి : ధవళేశ్వరం వద్ద గోదావరి వరద నీటి మట్టం తగ్గింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు . ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద 11.7 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 9.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కాగా రెండు రోజుల క్రితం వరద ప్రవాహం భారీగా పెరగడంతో రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు కొనసాగించారు. ఆదివారం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను, నేడు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇక‌ వరద ప్రవాహం తగ్గడంతో లంకగ్రామాలు నీటి నుంచి తేరుకుంటున్నాయి. నిర్వాశితులు త‌మ త‌మ స్వ‌గృహాల‌కు చేరుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement