Friday, November 22, 2024

దేశంలోనే ఫ‌స్ట్ టైమ్‌.. రైళ్ల‌ ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా విప్లవాత్మకం

రైళ్ల ద్వారా బల్క్‌ సిమెంట్‌ సరఫరా చేయడమనేది విప్లవాత్మక మార్పని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించామని వికాట్‌ గ్రూప్‌ సీఈఓ అనూప్‌ కుమార్‌ సక్సేనా సంతోషం వ్యక్తం చేశారు.శుక్రవారం బిసిసిఎల్‌ లో బల్క్‌ సిమెంట్‌ ను కం-టైనర్లతో కూడిన రైళ్ళను రైల్వే అధికారులు బిసిసిఎల్‌ అదికారులు సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.తమకు సహకారాన్ని అందిస్తున్న కాంకర్‌ గ్రూప్‌,భారతీయ రైల్వే ఆదికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగావినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు.సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డిఆర్‌ యం రెడ్డి,సీసీయం జాన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మహరాష్ట్ర లోని ముంబైలో బల్క్‌ సిమెంట్‌ టర్మినల్‌ విజయవంతం కావడంతో అదే స్పూర్తీతో బల్క్‌ సిమెంట్‌ సరఫరాకు శ్రీకారం చుట్టిందన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్రకు సరఫరా చేసేందుకుప్రయత్నం చేస్తామన్నారు.మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, డైరెక్టర్‌ లు జేజేరెడ్డి, మాట్లాడుతూ బిసిసిఎల్‌ మరింత సమర్థవంతంగా పర్యావరణ రహితంగా సిమెంట్‌ సరఫరా చేసేందుకు సరికొత్త విధానాలతో ముందుకు వస్తుందన్నారు.ఈ కార్యక్రమంలోహరీష్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సాయి రమేష్‌, సీనియర్‌ మేనేజర్‌ పేర్ల భార్గవ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement