Monday, December 9, 2024

AP | తిరుపతి నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు..

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో తిరుపతి విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ఈ క్ర‌మంలో తిరుపతి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 5 గంటలకు తొలి అంతర్జాతీయ విమానం సింగపూర్‌కు బయలుదేరనుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement