Friday, September 20, 2024

AP | కృష్ణమ్మ‌ ఉగ్ర‌రూపం… ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద‌ తొలి ప్రమాద హెచ్చరిక జారీ

విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మరోసారి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్ర‌మంలో ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల‌నుంచి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణానదిపై జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తడంతో అన్ని డ్యామ్‌ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మరోసారి వరద ప్రవాహం పెరిగింది.

దీంతో అప్రమత్తం అయిన అధికారులు అన్ని గేట్లు పైకి ఎత్తి పెట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు బ్యారేజ్‌ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4 లక్షల 50 వేల 442 క్యూసెక్కులుండగా.. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement