Wednesday, November 20, 2024

AP | ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ…

వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరి కి వరద హెచ్చరికల నేపథ్యంలో (మంగళవారం) రాత్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.

భద్రాచలం వద్ద 47.50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవలేశ్వరం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 8. 36 లక్షల నీటిని క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రానికి 10 లక్షలు చేరుకుని మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందన్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రేపు ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా రెండోవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత ఉధృతిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు.

వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నందున మత్స్యకారులు గోదావరిలోకి వెళ్లవద్దని సూచించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు , సెల్ఫీలు దిగేందుకు ఎవరు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించవద్దని, వాయిదా వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement