ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో ఓ అగ్నిమాపక అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. జిల్లాలోని బద్వేలు అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న ఓబులేసు.. కర్నూలు జిల్లా, రాజానగరంలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిబ్బందిని వేధిస్తున్నారని ఓబులేసుపై వచ్చిన ఆరోపణల మేరకు ఓబులేసుపై విచారణ జరిపి రెండు నెలల క్రితం సస్పెన్షన్ విదించారు ఉన్నతాధికారులు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈరోజు ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..