Monday, December 23, 2024

Nandyala | మున్సిపల్ పార్కులో అగ్నిప్రమాదం..

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 23 : జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపల్ పార్కులో తెల్లవారుజామున కొందరు యువకులు చలిమంట కోసం నిప్పు వేసుకుని వెళ్లిపోయారు. అనంతరం అందులో ఉన్న నిప్పు చుట్టుపక్కల ఉన్న కాగితాలు చెత్తాచెదారంకు ఒక్కసారిగా అంటుకున్నాయి.

ఆ ప్రాంతంలో ఉన్న రేకుల షెడ్లు కూడా అంటుకున్నాయి. ఈ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పిసింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం నష్టం లేదు. ఆస్తి నష్టం సుమారుగా రెండు లక్షల రూపాయల మేర‌కు జరిగిందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement