తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని యూనియన్ బ్యాంక్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, కంప్యూటర్లు, పలు ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement