. విశాఖ లోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 40కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రి 11:30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి..ఈ ప్రమాద సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.. మత్స్యకారులు తమ బోట్లు అన్నింటిని హార్బర్ లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల సముద్రం పైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికి చేరాయి. వారిలో రూ. లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ. 5 నుంచి రూ. 6 లక్షల విలువైన చేపలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో 40 బోట్లకు పైగా కాలి బూడిద అయ్యినట్లు చెబుతున్నారు.. మొత్తం రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.. అర్ద రాత్రి నుంచి నాలుగు ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమిస్తూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.. కానీ ఇప్పటికి మంటలు అదుపులోకి రాలేదు.. విశాఖ ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో భారీ అగ్నిప్రమాదం ఇదే.. మొత్తం 40 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయినట్లు చెబుతున్నారు మత్స్యకారులు
.. ఇక బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పదార్దాలు ఉండడంతో భారీ పేలుళ్లు సంభవించాయి.. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు.. కళ్ళ ఎదుట జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో తీవ్ర విషాదంలో ఉన్నాయి మత్స్యకార కుటుంబాలు.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి