Saturday, November 23, 2024

Nandyala : ఆస్ప‌త్రిలో అగ్ని ప్రమాదం..

నంద్యాల బ్యూరో : నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లోని మోర్ సూపర్ మార్కెట్ పైన శ్రీకరి విజై బాబు ప్రవేట్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఇవాళ ఉద‌యం 8 గంటలకు ఈ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా వ్యాపించి హాస్పిటల్ లో ఉన్న విలువైన సామగ్రి మంటలకు కాలిపోయాయి.

అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారి కావటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. ఆసుపత్రి పైభాగం అంతా పూర్తిగా కాలిపోయింది. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement