Wednesday, November 20, 2024

Flash.. Flash: ప్రైవేట్​ ఆస్పత్రిలో ఫైర్​ యాక్సిడెంట్​.. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు

ఆంధ్రప్రదేశ్​ తిరుపతి జిల్లాలోని గూడూరు టౌన్​లో ఫైర్​ యాక్సిడెంట్​ జరిగింది. మార్కెట్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన ఆస్పత్రి యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పత్రి యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించడంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని ఆస్పత్రి యాజమాన్యం తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement