కర్నూలు, (ప్రభ న్యూస్) : జిల్లాలో కొవిడ్ మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి కలెక్టర్ కోటేశ్వరరావ్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్న మృతుల కుటుంబాలకు పరిహారం అందించడానికి వేగంగా అడుగులు వేశారు. రేపు నుంచి బాధిత కుటుంబాలకు రూ.50 వేలను వారి ఖాతాకు జమ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో కోవిడ్ రెండు దశలలో ఇప్పటివరకు 854 మంది మృత్యువాత పడగా, కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఆర్థిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించి.
అన్ని పత్రాలను పరిశీలించారు. నిర్దారణ కమిటీ ద్వారా 274 కుటుంబాల జాబితాను తయారు చేశారు. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.50వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ దరఖాస్తులను ఈనెల 3 నుంచి స్వీకరించారు. బాధితుల నుంచి ఐసీఎంఆర్, ల్యాబ్ రిపోర్టు, మృతుని ఆధార్, దరఖాస్తుదారుడి ఆధార్ నంబర్, మరణదృవీకరణ పత్రం, కుటుంబ ధృవీకరణ పత్రాలను తీసుకొని ఒక ప్రత్యేక నిర్దారణ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నారు. కేవలం ధరఖాస్తులు పరిశీలించి సంబంధిత కుటుంబాలకు 20 రోజుల్లోగా పరిహారం పంపిణీకి శ్రీకారం చుట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital