ఏపీ ఆర్థిక శాఖలో లెక్కలపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితమని, రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయని స్పష్టం చేశారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. ఆడిట్ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సందేహాలు ఉంటే మీటింగ్ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. సీఎఫ్ఎంఎస్ వచ్చాక ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే సీఎఫ్ఎంఎస్ను ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారరని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు కడుతున్నాయని వివరించారు.
రూ.41 వేల కోట్లకు లెక్కలున్నాయి: పయ్యావులకు బుగ్గన కౌంటర్
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- ap latest news
- AP Nesw
- AP NEWS
- ap news today
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- TDP Leader Payyavula keshav
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement