Monday, November 25, 2024

Final count – ఎపిలో 81.86 శాతం పోలింగ్..ప్ర‌కాశం,చిత్తూరు జిల్లాలలో 87.09 శాతం ఓటింగ్

36 గంట‌ల త‌ర్వాత లెక్క‌లు విడుద‌ల
ప్ర‌కాశం,చిత్తూరు జిల్లాలలో 87.09 శాతం పోలింగ్
విశాఖ‌లో అత్య‌ల్పంగా 68. 63 శాతం ఓటింగ్
ద‌ర్శిలో ఏకంగా 90.91 శాతం పోలింగ్
తిరుప‌తిలో కేవ‌లం 63.32 శాతానికే ప‌రిమితం

ఎపిలో రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని చెప్పారు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా. పోలింగ్ ముగిసిన 36 గంట‌ల త‌ర్వాత ఓటింగ్ వివరాల‌ను మీడియాకు అందించారు.. పోలైన ఓట్ల‌లో ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం మేర నమోదైనట్లు వెల్లడించారు.

3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్‌ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని.. రీపోలింగ్‌పై ఏమీ చెప్పలేదని సీఈవో వివరించారు.

గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో చెప్పారు.

జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement