Wednesday, January 29, 2025

AP | సీమ‌లో సినీ ప‌రిశ్ర‌మ‌… ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం

కర్నూలు బ్యూరో : ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో స్థాపిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడారు.

తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేదన్నారు. మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద, పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోసిన విషయాన్ని గుర్తు చేశారు. కళలకు రాయల సీమ పుట్టినిల్లు అన్నారు. సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది రాయలసీమ వాసులే అన్న విషయం గుర్తు చేశారు.

కానీ సినిమా నిర్మాణం, చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదన్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయిందన్నారు.

ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీజీవి చెప్పారు. నిబద్ధతతో ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, అనుమతులు కావాలన్నా వారికి తాము సహకరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement