Tuesday, November 19, 2024

మంత్రి అప్పలరాజు పై గుంటూరు లో కేసు నమోదు

గుంటూరు – రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి ఆప్పలరాజుపై గుంటూరులో కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి కాలే దేవదాసు అనే వ్యక్తి బుధవారం ఉదయం గుంటూరు ఆరండల్ పేట పోలీసు స్టేషన్ లో మంత్రి అప్పలరాజు పై ఫిర్యాదు చేశారు. ఇదే పోలీసు స్టేషన్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సైతం కేసు నమోదైంది. చంద్రబాబు పై నమోదైన కేసులోని అంశాలనే పేర్కొంటూ తాజాగా మంత్రి అప్పలరాజుపై కేసునమోదు కావటం విశేషం. టీడీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జీ కోవెలమూడి రవీంద్ర లతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు దారుడు దేవదాసు వెంట పోలీసు స్టేషన్ కు వచ్చారు. మంత్రి అప్పలరాజు ఈనెల 8 వ తేదీన ఒక టీవీ చానెల్ లో మాట్లాడుతూ కర్నూల్ కేంద్రంగా ఎన్ 440 కె అనే కొత్తరకం వైరస్ వేరియంట్ పుట్టిందని, అది కరోనా కంటే 10 నుంచి 15 రేట్లు అధికంగా వ్యాప్తి చెంది మానవనష్టం జరుగుతుందని వ్యాఖ్యలు చేసినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా గుంటూరు నగరంలోని ప్రజానీకం భయంతో వైద్యం నిమిత్తం హైదరాబాదు కు తరలిపోతున్నారని ఆయనన్నారు. హైదరాబాదు నగరంలోనిఆసుపత్రులకు వెళ్తున్న అంబులెన్స్ లను సరిహద్దుల వద్దనే ఆ రాష్ట్ర అధికారులు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల పట్ల పొరుగు రాష్ట్రాలవారు హేళనగా మాట్లాద్తునరని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి ప్రకటన కారణంగా రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్ లుగా పనిచేసున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులు,భయాందోళనలకు గురయి మానసిక వత్తిడికి లోనవుతున్నారని ఆయన తెలిపారు. మంత్రి వ్యాఖ్యల కారణంగా రాష్ట్ర ప్రజలు వివక్షకు గురవుతున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.మంత్రి వ్యాఖ్యల కారణంగా భయాందోళనలకు గురయి ఇప్పటికే చాలా మరణించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రి అప్పలరాజు, ఆయన ఆ ప్రకటన జారీచేసేందుకు కారకులైన ఇతరులు అందరిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు చేపట్టాలని దేవదాసు తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement