Tuesday, November 26, 2024

కార్మికుల తరఫున పోరాడేది ఎర్రజెండానే : సీపీఐ రామకృష్ణ

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుడు మాత్రమే సంస్ధను తనదిగా భావిస్తాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తాం అంటున్నాడని.. ప్రభుత్వరంగ పరిశ్రమలలో ప్రధాని మోదీ తాత, తండ్రి సంపాదించింది ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నారని.. విశాఖ ఉక్కును కేవలం కలం పోటుతో ప్రైవేటుపరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేకుండా పోయిందన్నారు. 35.1% ఏపీలో నిరుద్యోగులున్నారని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలో సమస్యలకే కాకుండా రైతుల సమస్యల కోసం ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల తరఫున పోరాడే జెండా.. ఎర్రజెండా మాత్రమేనని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement