బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
వర్షాల దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు ముందస్తు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి.