ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు . పలువురు కేంద్ర మంత్రులతో కలిసిన పవన్ ఎపి అభివృద్ధి కి సహక రించాల్సిందిగా కోరారు.
ఇక నేడు భూపేంద్ర యాదవ్ తో సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు..
- Advertisement -
ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు ఇవాళ పవన్ కళ్యాణ్ విందు ఇవ్వనున్నారు. తాజ్ హోటల్లో విందు ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పంపారు పవన్.