Thursday, January 9, 2025

AP CM : నక్సల్స్ భయం.. సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు జరిగాయి. కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో.. ఎస్‌ఎస్‌జీ (స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌)లో ఇటీవల పలు మార్పులు చేశారు. ప్రస్తుతం చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న ఎన్‌ఎస్‌జీ బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు, ఎస్‌ఎస్‌జీ సిబ్బందికి ఇప్పుడు కౌంటర్ యాక్షన్ టీమ్ కూడా రక్షణగా ఉంటుంది. ఈ మేరకు ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు విధుల్లో ఉంటున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా భద్రతాపరమైన మార్పులు చేశారు.

చంద్రబాబుకు మూడంచెల భద్రత కల్పిస్తారు.. ఎన్‌ఎస్‌జీ తొలి, ఎస్ఎస్‌జీ రెండు వలయాల్లో సెక్యూరిటీని కల్పిస్తాయి. మూడో వలయంగా సీఎం పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు భద్రతను ఇస్తాయి. వీరితో పాటుగా ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి సమీపంలో ఆరుగురు కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలు సెక్యూరిటీగా ఉంటారు.

ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ ముఖ్యమంత్రిని రక్షించి సురక్షితంగా ఉండే ప్రాంతానికి తీసుకెళతారు. ఈలోపు కౌంటర్ యాక్షన్ టీమ్ బయటి నుంచి దాడి చేసే వారిని ఎదుర్కొంటుంది. ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) ఈ కౌంటర్‌ యాక్షన్‌ కమాండోలకు శిక్షణను ఇచ్చాయి. ఈ టీమ్‌లో కమాండోలు ప్రత్యేకంగా నలుపు రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు డ్రెస్ కోడ్ ఉంది. వీరి షర్ట్‌పై ఎస్‌ఎస్‌జీ అని రాసి ఉంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement