Saturday, October 19, 2024

Bears : భల్లూకాలతో భయం.. గ్రామాల్లోకి ఎలుగుబంట్లు

నీళ్లు, తిండి లేక తిప్పలు
వణికిపోతున్న జనం
అనంతపురం, ఆగస్టు 7 (ప్రభ న్యూస్ బ్యూరో) : కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నా యి. గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అడవుల్లో నీళ్లు, మేత కరువైంది. దీంతో రాత్రి సమయంలో నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. అప్పుడప్పుడు అవి దాడులు చేస్తుండ‌డం వ‌ల్ల‌ గాయాలపాలవుతున్నారు.

జిల్లాలో అటవీ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా అడవులు పెరుగుతున్నాయి. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా నిధుల లేమి కారణంగా అటవీశాఖ వన్యప్రాణుల సంరక్షణకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అడవుల్లో వాటికి ఆహారం అందించడానికి, తాగునీటి కోసం సాసర్లను నిర్మించలేకపోతున్నారు. దీంతో తాగునీటి కోసం వ్యవసాయ బోర్లు, బావుల దగ్గరికి వెళుతున్నాయి. అక్కడున్న రైతులను గాయపరుస్తున్నాయి.

తాజాగా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి, బొబ్బర్లపల్లి గ్రామ కొండ ప్రాంతాల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రెండు పిల్లలను వెంట తీసుకుని వచ్చిన ఎలుగుబంటి గ్రామాల వద్దకు వచ్చింది. కొండ ప్రాంతం నుండి కిందకు దిగుతుండగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వారం రోజుల్లో మూడు దపాలుగా ఎలుగుబంట్ల సంచ‌రించ‌డంతో భయం గుప్పెట్లో వెస్ట్ కోడిపల్లి రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement