తిరుమల, ప్రభన్యూస్ :శ్రీవారిని మరింత వేగంగా, సులభంగా భక్తులు దర్శించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలక మండలి సమావేశం కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరింత సౌకర్యవంతంగా దర్శనం క ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత అధిక సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భ క్తుల భక్తుల సౌకర్యార్ధం సర్వదర్శనం, టైం స్లాటెడ్ దర్శనాలు కొనసాగిస్తామన్నారు. నడకదారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీని పున:ప్రారంభిస్తామని చెప్పారు.
ముంబైలో ఆలయ నిర్మాణానికి రేమండ్స్ సహకారం
మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిందని సమావేశంలో వివరించారు. ఆలయ నిర్మాణానికి కూ. 60 కోట్లు విరాళం ఇచ్చేందుకు దాత రేమండ్ సంస్థ అధినేత గౌతంసింఘానియా ముందుకొచ్చారని, అదేవిధంగా శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాక మే 5 వ తేదీ సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ముంబై నగరంలో శ్రీవారి ఆలయం కేవలం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇరుకైన ప్రాతంలో రెండు దశాబ్దాలుగా ఉందన్నారు. అటువంటిది ఇంత విశాలమైన ప్రాంగణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరగడం చారిత్రాత్మకమైందన్నారు.
5నుంచి శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులకు అనుమతి
ఇక గతేడాది కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గాన్ని పునరుద్దరించి మే 5 వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు కొత్త బంగారు సింహాసనాలకు బంగారు పూత పోయడానికి రూ 3.61 కోట్లతో టెండర్ల ద్వారా చేయుటకు అనుమతి మంజూరు చేశామని, అలాగే శ్రీపద్మావతి మెడికల్ కళాశాలలో రూ.21.20 కోట్లతో ఈ మరియు ఎఫ్ బ్లాకులు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐఐటి నిపుణుల సూచన మేరకు తిరుమల రెండవ ఘాట్‌రోడ్డుులలో ఆర్‌సిసి రోడ్డు, క్రాస్ బ్యారియర్స్ నిర్మాణం కొరకు మొదటి దశలో రూ.20 కోట్లు, రెండవ దశలో రూ. 15 కోట్లు కేటాయించేందుకు ఆమోదించింది. అలాగే శ్రీనివాససేతు రెండవ దశ పనులకు రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే తిరుమలలో ఇప్పటిదాకా కేటాయించిన దుకాణాలు, లైసెన్సులు క్రమబద్దీకరించి లీగల్ హైర్ చేయాలని తీర్మానం చేశారు.
మామండూరు మీదుగా మూడో మార్గం
కాగా తిరుమలలో మూడవ మార్గం నిర్మాణానికి ఇంకా అనుమతులు రాలేదని, అనుమతులు వచ్చాక మామండురు మీదుగా మెట్లమార్గం నిర్మిస్తాం. 2023 మార్చి నాటికి రెండవ దశ పనులు పూర్తి. తిరుమల బాలాజి నగర్ వద్ద 2.86 ఎకరాల స్థలం ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సహకారంతో తడి చెత్త ద్వారా బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా టిటిడి ఆస్థాన సిద్దాంతిగా తంగికాల వెంకటకృష్ణపూర్ణప్రసాద్ సిద్దాంతిని 2022-23 వ సంవత్సరానికి నియమించాలని నిర్ణయించారు. చెన్నైకి చెందిన ఆర్.కర్ణావతి టిటిడికి విరాళంగా అందించిన పాండిచ్చేరిలోని రూ.58 ల క్షల విలువగల ఇంటిని స్వీకరించాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగుల క్వార్టర్లను పునరుద్ధరణకు రూ.19.40 కోట్లు మంజూరు చేశారు. నగదు విరాళాలకు ఇచ్చే ప్రయోజనాలు, రాయితీలను వస్తురూపంలో ఇచ్చే విరాళాలకూ వర్తింప చేయాలని టీటీడీ నిర్ణయించింది.
రూ.90 లక్షలు విరాళమిచ్చిన వైవీ
టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా రూ. 90 లక్షలు రాళంగా అందించారు. ఇప్పటికే రూ. 10 లక్షలు విలువైన దేశీ ఆవులను రాళంగా అందించారు. టిటిడి చైర్మెన్ శనివారం నేడు తన పుట్టిన రోజు సందర్భంగా టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు 90 లక్షలు రాళంగా అందచేశారు. గతంలో ఎస్వీగోశాలకు రూ. 10 లక్షల లువైన దేశీ ఆవులను ఆయనవిరాళంగా అందచేశారు.