నంద్యాల బ్యూరో, డిసెంబర్ 6 : జిల్లాలోని రైతులు తమ పొలాలకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న సమస్యలను ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా సద్వినియోగం చేసుకొని పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ తెలిపారు. రెవెన్యూ సదస్సులు ప్రారంభోత్సవంలో భాగంగా శుక్రవారం జిల్లాలోని గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ వీఆర్వోలు, ప్రజలు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించిన పొలం సర్వేలో గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా ఈ కార్యక్రమంలో సరిదిద్దుకోవాలన్నారు. గ్రామానికి సంబంధించిన మ్యాప్ ను తీసుకొని పొలాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -