ధాన్యం బకాయిలు విడుదల చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. పాలకొల్లు యడ్లబజార్ నుండి నర్సాపురం వరకూ 12 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్రకు చేపట్టారు. రైతుల ఆకలి కేకలు పేరు మీద జోరువానలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు. ధాన్యం బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు పంట పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా ఉందని ఎమ్మెల్యే నిమ్మల అన్నారు. రైతు ప్రభుత్వం అంటూ రంగుల ప్రకటనలు కాదని, ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. అరా కొరా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులతో రైతులను ప్రభుత్వం దగా మోసం చేస్తోందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: సొరంగంలో వరద నీరు.. 13 మంది మృతి