ఓర్వకల్లు మండలం కనమడక గ్రామంలో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బోయ మహేష్ అనే రైతు అప్పుల బాధ భరించలేక గత రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహేష్ తన పూర్వీకుల నుంచి వచ్చిన కొంత భూమి ఉండగా, మరికొంత భూమి కౌలుకి తీసుకున్నాడు.
కాగా గత ఖరీఫ్ లో దాదాపు రూ.5లక్షలకు పైగా అప్పు చేసి పంట సాగు చేశాడు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఇదే సమయంలో అప్పులు చెల్లించాలని రుణదాతలు వెంటపడడంతో ఏమి చేయాలో దిక్కుతోచక మహేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు వెల్లడించారు.