ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి. జనసేన, బిజెపి కూటమి జయకేతనం ఎగురవేసిన ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నాలెజినోవా కొణిదెలతో పాటు తన కుమారుడు అకీరా నందన్‌ను సైతం దిల్లీకి తీసుకెళ్లారు.
కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈసందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.