Friday, November 22, 2024

నా పేరుతో ‘ఫేక్‌ ట్వీట్‌’ వైరల్‌.. దేవినేని ఉమా వెల్ల‌డి

అమరావతి, ఆంధ్రప్రభ : తన పేరుతో నకిలీ ట్వీట్‌ సృష్టించి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని, ఇందుకు కారణమైన రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈమేరకు ఉమా సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని సి ఐడి కార్యాలయానికి వచ్చిన ఉమా డిఐజి సునీల్‌ నాయక్‌ను కలిసి ఫిర్యాదు పత్రం అందచేశారు. నకిలీ ట్వీట్‌ను సోషల్‌ మీడియాలో ప్రచారంలో పెట్టిన మంత్రి అంబటి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని, ఈ నకిలీ ట్వీట్‌ను తనతోపాటు చాలామందికి వైరల్‌ చేశారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తూ తాను ట్వీట్‌ చేసినట్లు నకిలీ ట్వీట్‌ వైరల్‌ అవుతోందని ఇందుకు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అంతకుముందు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వచ్చిన దేవినేని ఉమాను సిఐడి కార్యాలయంలోకి అనుమతించలేదు. ఈ సందర్భంగా తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఉమాని మాత్రమే లోనికి పంపడంతో డిఐజిని కలిసి మంత్రిపై ఫిర్యాదు చేశారు. అనంతరం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు వ ర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బచ్చుల అర్జునుడు, తనతో సహా వైసీపీ నేతలు ఫే క్‌ ట్వీట్లు సృష్టించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని చివరికి తన అధినేత చం ద్రబాబు సంతకం, పార్టీ లెటర్‌ హెడ్‌ ఫోర్జరీ చేశారని ఆరోపించారు. బాధ్యత కలిగిన మంత్రి ఈతరహా ట్వీట్‌లను వరైల్‌ చేయడం వెనుక వైసీపీ కుట్ర దాగుందని, ఇకనైనా నకిలీ ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. దీనికి సీఎం జగన్‌ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement