Saturday, November 23, 2024

శ్రీవారి భక్తులకు అలర్ట్‌: టిటిడి పేరుతో మరో ఫేక్‌ వెబ్‌సైట్

తిరుమల: ఫేక్‌ వెబ్‌సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా.. చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు https://tirupatibalaji-ap-gov.org/ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారని ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ఫేక్‌ వెబ్‌సైట్‌ను నమ్మొద్దని భక్తులను కోరింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరారు. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చని పేర్కొన్నారు.. . ఇప్పటివరకు తితిదే పేరుతో ఉన్న 41 నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టిటిడి వెల్లడించింది.


ఇది ఇలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానముల (టీ టీ డి ) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement