Tuesday, November 26, 2024

Fake Seeds Rocket – ఎపిలో న‌కిలీ విత్త‌నాల జోరు…

అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయ సీజను ప్రారంభం కాకముందే నకిలీ విత్తనాలు మార్కెట్‌ లో విజృంభించాయి. గతేడాది పత్తికి రైతులు ఆశిం చిన ధర కంటే మించి వుండడంతో ఈ సంవత్సరం పత్తి సాగు పై మొగ్గు చూపారు. దీన్ని ఆసరాగా చేసుకున్న విక్రేతలు పొరుగు రాష్ట్రాల్ర నుంచి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి రైతులకు అమ్ముతున్నా రు. రాష్ట్రంలో ప్రధానంగా పత్తి విత్తనాల విక్రయా లకు గుంటూరు జిల్లా కేంద్రంగా వుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రైతులు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్ల్రో భూములు కౌలుకు తీసుకుని ప్రధాన వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు.

కంపెనీలకు విత్తనాలు పండించే క్రమంలో దిగుబడి వచ్చినవన్నీ వారికి ఇవ్వకుండా కొన్ని మిగుల్చుకుని ఇక్కడి వారికి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల రైతులతో గుంటూరు జిల్లా వాసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని కొందరు వృత్తిగా మార్చుకుని ఏటా సీజన్‌లో క్రయవిక్రయాలు చేస్తున్నారు. తెలిసిన వారు కావడం, మార్కెట్‌ కంటే తక్కువ ధరకు వస్తుండడంతో రైతులు కూడా కొనుగోలు చేస్తున్నా రు. ఇక్కడితో ఆగిపోకుండా వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో వివిధ కంపెనీల పేర్లతో సంచులు తయారు చేయించి వాటిలో నింపి మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో కొంతమందితో కలిసి వ్యాపారం చేస్తున్నారు.

అనుమతి లేని విత్తనాలు పెద్దఎత్తున రవాణా చేస్తుండగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంతో అక్రమం వెలుగులోకి వచ్చింది. నకిలీ విత్తనాల అక్రమ రవాణా ప్రధానంగా పార్సిల్‌ సర్వీసులు, ఆర్టీసీ, ప్రయివేటు- బస్సులు కార్గో సర్వీసులు, కొరియర్‌ సర్వీసుల ద్వారా జరుగుతుంది. దీనికి నిదర్శనంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండులో గత వారం కర్ణాటక బస్సు నుంచి దించిన పార్శిల్స్‌లో 280 పత్తి విత్తన సంచులు (ఒక్కొక్క సంచిలో 450 గ్రాములు) అనుమతి లేకుండా రవాణా అయినట్లు- నిఘా, వ్యవసాయాధికారుల బృందం గుర్తించింది. కర్ణాటకలోని రాయచూరు నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు బస్టాండుకు వచ్చాయి. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన రాంబాబు పేరుతో పార్శిల్‌ రావడంతో కేసు నమోదు చేశారు. మన రాష్ట్రంలో అనుమతి లేని కంపెనీ విత్తనాలు కర్ణాటక నుంచి అక్రమంగా తెప్పించినట్లు- గుర్తించారు. దీంతో పాటు- అయిదుగురు రైతులు కొనుగోలు చేసినట్లు- చూపిన చిరునామా, చరవాణి నంబర్లు నకిలీవిగా గుర్తించారు. ఇతను గతంలో కూడా అక్రమంగా పత్తి విత్తనాలు తరలిస్తూ పట్టు-బడినట్లు- గుర్తించారు.

అలాగే పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన గడ్డం రవీంద్రబాబు, నంద్యాల జిల్లా గోసపాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మెరిగే వేణు, అన్నమయ్య తదితరులతో కలిసి కర్ణాటక నుంచి మహారాష్ట్రకు అనుమతి లేని పత్తి విత్తనాలు సరఫరా చేస్తూ తెలంగాణ రాష్ట్రం నార్కట్‌పల్లి వద్ద వాహనాల తనిఖీల్లో పత్తి విత్తనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి సేకరించిన విత్తనాలను పల్నాడు జిల్లా దాచేపల్లి తరలించి ఇక్కడ ప్యాకింగ్‌ చేసి మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతానికి తరలించి అక్కడి రైతులకు విక్రయిస్తున్నారు. వీరి నుంచి రూ.1.8కోట్ల విలువైన 10 టన్నుల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

నిఘా నిల్‌
గతంలో నకిలీ విత్తనాల వ్యాపారం చేసేవారిని గుర్తించి విత్తన సీజన్‌లో వ్యవసాయ శాఖ నిఘా పెట్టేది. ఇటీ-వల కాలంలో వారిపై నిఘా తగ్గడంతో ఈ ఏడాది మళ్లీ ప్రారంభించారు. విత్తన సేకరణ నుంచి ప్యాకింగ్‌ చేసి రవాణా, విక్రయాల వరకు అనుభవం ఉండడంతో అందరూ కలిసి పెద్దఎత్తున రవాణా ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులకు పట్టు-బడితే కర్ణాటక నుంచి తెచ్చి పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్యాకింగ్‌ చేసినట్లు- తేలింది. దాచేపల్లిలోనూ గతంలో పెద్దఎత్తున అనుమతి లేని పత్తి విత్తనాలు పట్టు-బడిన సందర్భాలు ఉన్నాయి.

నకిలీ చిరునామాలతో పార్శిళ్లు…
పత్తి విత్తన సీజన్‌ ప్రారంభం కావడంతో మళ్లీ అక్రమార్కులు క్రియాశీలమై చాప కింద నీరులా విక్రయాలు చేస్తున్నారు. వీరు ఇచ్చే విత్తనాలకు బిల్లులు లేకపోవడం, స్థానికంగా తెలిసిన రైతులకు విక్రయిస్తుండడంతో బహిర్గతం కావడం లేదు. గుంటూరు ఆర్టీసీ బస్టాండులో పట్టు-బడిన అనుమతి లేని విత్తనాలు సైతం నకిలీ రైతులు, చిరునామాలతో ఇక్కడికి రవాణా కావడం గమనార్హం. యంత్రాంగానికి తెలియకుండా ఏ మేరకు రవాణా జరుగుతున్నాయో తెలియాల్సి ఉంది. ఇప్పటి-కై-నా వ్యవసాయ శాఖ గ్రామాలు, పార్శిల్‌ కార్యాలయాల్లో నిఘా పెడితే కొంతవరకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అనుమతి లేని విత్తన రవాణాలో ్లగసిల్‌ బీటీ- విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు- కూడా ఆరోపణలు ఉన్నాయి. జూన్‌, జులై నెలల్లో పత్తి విత్తన రవాణాపై దృష్టి సారించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement