Saturday, December 21, 2024

AP | పోలీసుల పేరుతో బెదిరింపులు.. నకిలీ ముఠా ఆటకట్టు

(విజయవాడ, ఆంధ్రప్రభ) : పోలీసులమంటూ అమాయక వ్యక్తులను బెదిరించడంతో పాటు, వారి వద్ద ఉన్న నగదు ఇతర వస్తువులను కాజేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ.26 లక్షల నగదును రికవరీ చేశారు.

వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. జగ్గయ్య పేటకు చెందిన వ్యక్తి బంగారపు షాప్ లో గుమస్తా.. ఈనెల 11వ తేదీన యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని క్యాబ్ లో చెన్నై వెలుతుండ‌గా.. విజయవాడ దగ్గరలోకి వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని ఇద్ద‌రు వ్య‌క్తులు ఖాకి దుస్తుల్లో వ‌చ్చి కారుని ఆపారు. పోలీసులమని బెదిరించి బలవంతంగా తన వద్ద ఉన్న బ్యాగ్ ను తీసుకుని అధికారులకు చూపించి వస్తాం అని చెప్పి వెల్లారు. అయితే, ఎంతకీ రాకపోవడంతో సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

ఫిర్యాదుపై పోలీస్ లు కేసు నమోదు చేయ‌గా.. పోలీస్ కమీషనర్.ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాలతో క్రైమ్ డిసిపి కె.తిరుమలేశ్వర రెడ్డి సూచనలతో, క్రైమ్ ఎడిసిపి. ఎం.రాజారావు, ఎ.సి.పి. శ్రీ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలానికి చేరుకొని సాంకేతక ఆధారాలను సేకరించి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి వ‌చ్చిన‌ సమాచారం శుక్రవారం బి.ఆర్.టి.ఎస్. రోడ్డు బానునగర్ లోని ఒక ఇంటి సమీపంలో నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో సీతారాంపురముకు చెందిన చేగు పార్దసాయి, వించిపేటకు చెందిన పటాన్ సుభాని ఖాన్ నువ్వు అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు ఇబ్రహింపట్నం, దుర్గాకాలనికి చెందిన గుళ్ళూరు వంశి కృష్ణం రాజు పరారిలో ఉన్నాడు.

అలాగే బానునగర్ కు చెందిన ప్రత్తిపాటి శాంతి, ఓల్డ్ ఆర్.ఆర్.పేటకు చెందిన రౌడీ షీటర్ షేక్ హజారుద్దిన్ చోటును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్కా ప్లాన్ ప్ర‌కారమే బంగారం షాపులో పనిచేసే వ్యక్తి నుంచి డ‌బ్బులు కాజేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం డబ్బులను అందరూ పంచుకునే సమయంలో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కీలకమైన ఈ కేసును అతి తక్కువ సమయంలో చేధించిన సి.సి.ఎస్.పోలీస్ ని పోలీస్ కమీషనర్ ఇతర అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement