వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ
అనుమానంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం
అనంతరం పోలీసులకు ఫిర్యాదు
నకిలీ అధికారిగా గుర్తింపు .. అరెస్
తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు లేఖ సమర్పించారు. అతడి వైఖరిపై అనుమానంతో ఈవో కార్యాలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో వారు నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడు నకిలీ ఐఎఎస్ అధికారి అని తేల్చారు. దీంతో అతడిని అరెస్డ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.