Tuesday, November 26, 2024

AP: నకిలీ వజ్రాల విక్రయ ముఠా అరెస్ట్

నకిలీ వజ్రాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పలమనేరులో తొమ్మిది మంది నకిలీ వజ్రాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు నకిలీ వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైరెడ్డిపల్లె మండలం చీలంపల్లె గ్రామానికి చెందిన బి.సుబ్రహ్మణ్యం, సి.సుబ్రహ్మణ్యం లు తక్కువ ధరకే వజ్రాలు ఇస్తామని నాగమంగళంలో టీకొట్టు నడిపే సల్మాన్ ను మోసగించేందుకు పన్నాంగం పన్నినట్లు తెలిపారు.

ప్రస్తుతం తమకు రూ.10వేలు ఇస్తే తమ వద్ద ఉన్న రెండు వజ్రాలు ఇస్తామని, ధర తర్వాత మాట్లాడుకుందామని చెప్పడంతో సల్మాన్ రూ.10వేలు ఇచ్చి వాటిని తీసుకున్నాడు. వెంటనే వాటిని తీసుకెళ్లి పరీక్షించగా నకిలీవని తేలడంతో పోసపోయినట్లు గుర్తించిన సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నకిలీ వజ్రాల విక్రయదారులను మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 36 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement