Friday, November 22, 2024

KNL |ధరలు డమాల్… రోడ్డెక్కిన ఉల్లి రైతు

  • వ్యాపారస్తుల సిండికేట్ అరికట్టాలని వినతి
  • ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో
  • సుందరయ్య సర్కిల్లో రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్


కర్నూలు బ్యూరో : ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యాపారస్తుల సిండికేట్ అరికట్టాలని, మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సుందరయ్య సర్కిల్లో ఉల్లి రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో సుమారు గంటన్నర సేపు అటూ ఇటూ పోయే వాహనాలను ఆపి రోడ్డును దిగ్బంధనం చేశారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టాలని, ఉల్లి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని, జాయింట్ కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, ఏపీ రైతు సంఘం వర్ధిల్లాలని రైతుల ఐక్యత వర్ధిల్లాలని, గిట్టుబాటు ధర ఇచ్చేవరకు పోరాడుతామని పెద్ద ఎత్తున నినదించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రాజశేఖర్, టి రాముడు, గురు శేఖర్, అబ్దుల్లా, రంగప్ప, వి వెంకటేశ్వర్లు, హుస్సేన్ భాష, సుధాకర్, జి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ సందర్భంగా జి రామకృష్ణ మాట్లాడుతూ… పది రోజులుగా ఉల్లి మార్కెట్లో ధరలు పూర్తిస్థాయిలో పడిపోయినాయని, రెండు లాట్లు మాత్రం హైయెస్ట్ చూపించి మిగతా 80% ఉల్లి ఉత్పత్తులను అత్యంత ధర తక్కువతో కొనుగోలు చేస్తున్నారని, దీనికి కారణం మార్కెట్ యార్డ్ లో వ్యాపారస్తులు అందరూ సిండికేట్ కావడమే కారణమని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

మార్కెట్ యార్డ్ లో పరిస్థితి మారకపోతే ఉల్లి పండించే రైతులు ఉల్లికి దూరమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందని, ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే కొనసాగితే రైతులంద‌రూ ఏకమై తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని, గత ప్రభుత్వాలకు పట్టిన గతే వీరికి పడుతుందని హెచ్చరించారు. వారం రోజుల లోపల సమస్య పరిష్కారం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి సింగవరం సురేష్, మిన్నళ్ల ఉల్చాల సావాది మద్దిలేటి కృష్ణ, మార్కాపురం ఆంజనేయులు, రైతులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement