అనంతపురం, ప్రభన్యూస్ బ్యూరో: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదవ తరగతి ఫలితాలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన తర్వాత ఇద్దరు విద్యార్థినులు ఫెయిల్ కావడంతో వేరువేరుగా తమ గ్రామాల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆవేదనకు గురి చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఒకరు, పామిడి మండలం కట్టకిందపల్లిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థిని వెన్నెల ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటు-ంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తండ్రి హనుమంతు, తల్లి రాజమ్మలకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు సంతానం కాగా అందులో వెన్నెల రెండవ కూతురు సోమవారం పదవ తరగతి ఫలితాలు వెలువడడంతో అది చూసిన వెన్నెల ఫెయిల్ అని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇంటి నందు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పామిడిలో మరో విద్యార్థిని ఆత్మహత్య..
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని కట్టకిందపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె శిరీష పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న బాలికను గుర్తించిన కుటు-ంబ సభ్యులు పామిడి ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందింది. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.