Tuesday, November 19, 2024

NLR: కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలు మూసివేయాలి.. డా.చింతా మోహన్

ముత్తుకూరు, జూన్ 28 (ప్రభ న్యూస్) : ముత్తుకూరు మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న సుమారు పది పరిశ్రమలను వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎంపీడీవో కార్యాలయం సమీపాన చెట్ల కింద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ… నెల రోజుల లోపల ఫ్యాక్టరీలు మూసి వేయకపోతే న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు. కాలుష్యాన్ని నియంత్రణ చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని కేంద్ర మాజీ మంత్రి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement