Saturday, November 23, 2024

AP | మ‌రోసారి జ‌గ‌న్ కు ఛాన్స్ ఇస్తే…. స‌ర్వం గోవిందా : నారా లోకేష్

రాజంపేట – ‘‘3 నెలలు రాజకీయాలు చేద్దాం. మిగతా 4 సంవత్సరాల 9 నెలలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు నమ్ముతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గండికోట ప్రాజెక్టుని పూర్తి చేసి పులివెందులకు కూడా నీళ్లు అందించిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. కడప జిల్లా రాజంపేట బహిరంగ సభలో మాట్లాడుతూ,. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన అభ్యర్థించారు.

‘‘ టిడిపి ప్రభుత్వ హయాంలో రూ.12-15 లక్షల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 35 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు చేసుకున్నాం. దాంట్లో భాగంగానే కియా మోటార్స్ వచ్చింది. అందులో 50 వేల మంది పనిచేస్తున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ వచ్చింది. అందులో 2 వేల మంది పని చేస్తున్నారు. ఈ విధంగా 44 వేల పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధిని తెలుగుదేశం పార్టీ కల్పించింది. కడపలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాం. రూ.100 కోట్లతో ఒంటిమిట్ట దేవాలయాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. కడప దర్గాను కూడా అభివృద్ది చేశాం’’ అని నారా లోకేశ్ అన్నారు.

‘ఒక్క అవకాశం’ అని అడిగితే అందరూ పడిపోయారు..

‘ఒక్క అవకాశం’ అనే మాటకు 2019లో అందరూ పడిపోయారని జగన్‌పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ యువతను జగన్ మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా అని ప్రశ్నించారు. ఇక 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, కానీ ఏనాడూ పార్లమెంటులో వాళ్లు ఏపీ గురించి మాట్లాడలేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారని, కానీ ఒక్క పరిశ్రమనైనా జిల్లాకు తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? అని లోకేశ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement