Saturday, October 5, 2024

AP | రైళ్లలో విస్తృత తనిఖీలు.. ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి….

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రత, వారికి అందిస్తున్న కేటరింగ్ సదుపాయాలు, సరుకు రవాణా, అనధికారక ప్రయాణాలపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడ రైల్వే డివిజన్ వాణిజ్య విభాగం అధికారులు శుక్రవారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తో పాటు సామర్లకోట స్టేషన్‌ను తనిఖీ చేస్తున్నారు విజయవాడ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వి రాంబాబు నేతృత్వంలో సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుండి సామర్లకోట్ వరకు విస్తృతంగా తనిఖీ చేశారు.

ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సేవల నాణ్యత, పరిమాణాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీ బృందం ప్రయాణీకుల నుండి అభిప్రాయాన్ని తీసుకోవడంతోపాటు ప్రయాణీకుల అవసరాలను మర్యాదగా శ్రద్ధగా ఉండాలని క్యాటరింగ్ బృందానికి సూచించింది. సామర్లకోట స్టేషన్ లో పార్శిల్ కార్యాలయం, బుకింగ్ కార్యాలయం, ప్రయాణీకుల సౌకర్యాలు, వెయిటింగ్ హాల్స్ క్యాటరింగ్ స్టాల్స్‌ను తనిఖీ చేశారు. గూడ్‌షెడ్‌, బుకింగ్‌ ఆఫీస్‌, పార్శిల్‌ కార్యాలయాల సూపర్‌వైజర్లతో సమావేశమై ప్రయాణికులు, సరుకు రవాణాను మెరుగుపరిచే మార్గాలపై చర్చించారు.

రైలు కార్యకలాపాలలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రయాణీకుల ఫిర్యాదులను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే భువనేశ్వర్ ఎస్ ఎం వి పాంట్రీ కార్ తనిఖీని నిర్వహించి, వంట చేసే ప్రదేశంలో నాణ్యత పరిశుభ్రతను పరిశీలించారు. వంటకు ఉపయోగించే పదార్థాల గడువు తేదీలను కూడా వారు తనిఖీ చేశారు. ప్రయాణీకుల డిమాండ్‌పై ఫిర్యాదు పుస్తకాన్ని అందించాలని, భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా క్యాటరింగ్ యాజమాన్యాన్ని ఆయన ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement